సదరం శిభిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి నూతన భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సదరం శిభిరాన్ని జిల్లా పాలనాధికారి రాజర్షి షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఇది సువర్ణమైన అవకాశమన్నారు. ప్రతి వికలాంగుడు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, DRDO రవీందర్, జై సింగ్ రాథోడ్ ఉన్నారు.