మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో 398 మంది బైండోవర్

మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో 398 మంది బైండోవర్

SRPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మునగాల పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతి పద్ధతులు కాపాడేందుకు ముందస్తు చర్యలో భాగంగా 398 మందిని బైండోవర్ చేశామని బుధవారం ఒక ప్రకటనలో మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్సై కోరారు.