నీట్ పరీక్షకు 97.5% హాజరు: కలెక్టర్

W.G: తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, తదితర ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో నీట్ యూజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. మొత్తం 1,886 మంది పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 1,847(97.5%) హాజరయ్యారన్నారు. 39 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు