పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం

KRNL: ఎర్రగుంట్ల ప్రభుత్వ పాఠశాలలో 1993-94లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం నాడు ఒకచోట చేరి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గురువులను ఘనంగా సన్మానించి, పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.పాఠశాల ఆవరణలో సంతోషంగా గడిపిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్యాహ్నం విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.