మంత్రి ముందే కాంగ్రెస్ నాయకుల ఘర్షణ

మంత్రి ముందే కాంగ్రెస్ నాయకుల ఘర్షణ

TG: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో రగడ నెలకొంది. మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుటే కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. ఇందిరమ్మ కమిటీల్లో అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని MLA రామ్మోహన్ భరోసా కల్పించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తీరుపై పటాన్‌చెరు కాంగ్రెస్ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.