సింగరేణి ట్రేడ్ మెన్ వారసుడే జిల్లా ఎస్పీ
BHPL: సింగరేణి కంపెనీలో బెల్లంపల్లి సివిల్ డిపార్ట్‌మెంట్‌లో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్న సిరిశెట్టి సత్య నారాయణ కుమారుడు సంకీర్త్ జిల్లాకు నూతన ఎస్పీగా నియమితులయ్యారు. అంతకుముందు మిషన్ భగీరథ ఇంజనీర్‌గా పని చేసిన సంకీర్త్, తన ప్రతిభతో సివిల్స్‌లో 330వ ర్యాంకు సాధించి IPS అధికారిగా ఎంపికయ్యారు. ఎస్పీగా రావడంతో సింగరేణి ప్రజలు అనందం వ్యక్తం చేశారు.