ఆదిలాబాద్‌కు చేరుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి
ADB: తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఈ మేరకు బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈనెల 4న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.