జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

తూ.గో: పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం ఎన్.పెదపాలెంలో సోమవారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు. స్థానిక గ్రామ సర్పంచ్ శీలం వెంకటేశ్వరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పలువురు మహిళలకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.