గుండెపోటుతో ఉద్యోగి మృతి

KRNL: ఆదోని డిప్యూటీ డీఎంఅండ్ఆచీ ఆఫీస్‌లో కమ్యూనిటీ ఆర్గనైజర్ పనిచేస్తున్న లక్ష్మన్న శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. స్వగ్రామం గడేకల్ గ్రామం కాగా ఉద్యోగ రీత్యా పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌లో ఉంటున్నారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ ఇంట విషాదం నెలకొంది.