ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌ను సన్మానించిన ఎమ్మెల్యే
KNR: చొప్పదండి మండలం పెద్దకురుమపల్లి గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సుగుణ దామోదర్ రెడ్డిని ఎమ్మెల్యే సత్యం సోమవారం అభినందించారు. గ్రామాభివృద్ధికి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఏకగ్రీవానికి సహకరించిన గ్రామప్రజల రుణం తీర్చుకునెల గ్రామాన్ని తీర్చిదిద్దాలన్నారు.