విద్యార్థులకు తప్పిన ప్రమాదం

NRPT: మక్తల్ మండలం కర్నే చెరువు అలుగు పారుతుండడంతో రోడ్డుపై ఉన్న కల్వర్టు వద్ద నీరు నిండుగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పట్టణానికి చెందిన ఓ పాఠశాల బస్సు విద్యార్థులతో వస్తూ నీటి మధ్యలో ఆగిపోయింది. వెంటనే స్పందించిన చుట్టుపక్కలవారు బస్సును తోసుకుంటూ ఒడ్డుకు చేర్చారు. దీంతో విద్యార్థులకు త్రుటిలో ప్రమాదం తప్పింది.