రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపల్‌లోని ఈద్గా, మసీదుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సర్తాజ్, నాయకులు అనంతరెడ్డి పాల్గొన్నారు.