కేంద్ర మంత్రికి చెరుకుపల్లి వినతి
W.G: బ్రాహ్మణులకు కార్పొరేషన్ ద్వారా పథకాలు అందేలా చూడాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పోరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ కోరారు. భీమవరం బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను కలిసి వినతిపత్రాన్ని అందించామని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీలో పేరుకు అగ్రవర్ణమైన బ్రాహ్మణులలో చాలా పేదవారు ఉన్నారని, వారికి కార్పొరేషన్ ద్వారా పథకాలు అందేలా చూడాలన్నారు.