ఆలయానికి విరాళం అందజేత
SRD: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన దైవభక్తిని చాటుకున్నారు. అమీన్‌పూర్ మండలం క్యాసారం గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి ఆయన రూ. 15 లక్షల విరాళం అందజేశారు. బుధవారం ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవిష్యత్తులోనూ ఆలయాల అభివృద్ధికి సహకారం అందిస్తానని భరోసానిచ్చారు.