రాయలసీమ యూనివర్సిటీకి 5 వరకు సెలవులు

కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ(ఆర్య) టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు నిన్నటి నుంచి ఈనెల 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ నాగుల అంకన్న తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వర్సిటీ పరిధిలో 144 సెక్షన్ విధించారని తెలిపారు. వర్సిటీలోకి ఎవరిని అనుమతించడం లేదని పేర్కొన్నారు.