క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం బాధాకరం: బండి సంజయ్
TG: రాష్ట్రంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం లేకపోవడం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) నిదర్శమని మండిపడ్డారు. HCAకు ఎంపిక కావాలంటే పైరవీలు చేసే సంస్కృతిని కొందరు తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. క్రీడాకారుల ప్రతిభను దెబ్బతీసే ఇలాంటి దుర్మార్గానికి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.