'ప్రగతి ధర్మారంకి మిని స్టేడియం కేటాయించండి'
MDK: మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బండ్రు శోభరాణి ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డిని రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం నేతలు కలిశారు. ఈ సందర్భంగా ZPHSకు చెందిన కబడ్డీ అండర్-17 ప్లేయర్స్ రాఘవి, పవిత్రలను జాతీయ స్థాయిలో ఆడేందుకు ప్రోత్సాహించాలని ఆయన్ను కోరారు. గ్రామంలో మినీ ఇండోర్ స్టేడియం, ఓపెన్ జిమ్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.