నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేసాం: డిప్యూటీ సీఎం

తాడేపల్లిగూడెం: నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోడ్లను అభివృద్ధి చేశానని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. శనివారం తాడేపల్లిగూడెం పట్టణం బలుసులమ్మ కళ్యాణ మండపంలో మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్, వర్కర్స్ యూనియన్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొట్టు విశాల్ తదితరులు పాల్గొన్నారు.