రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికులకు గాయాలు

రోడ్డు ప్రమాదంలో చేనేత కార్మికులకు గాయాలు

అన్నమయ్య: మదనపల్లి సమీపంలోని CTM వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నీరుగట్టువారిపల్లికి చెందిన చేనేత కార్మికులు వెంకటరమణ, రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. తరిగొండ లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన కారు వీరి బైకును ఢీకొట్టింది. బాధితులను వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.