ప్రమాదకరంగా వజ్రాల వేట

ప్రమాదకరంగా వజ్రాల వేట

NDL: మహానంది–సిరివెళ్ల మండలాల సరిహద్దులోని సర్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీప నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వజ్రాల వేటలో నిమగ్నమవుతున్నారు. భారీ వర్షాలతో వాగులు ఉద్ధృతంగా ఉన్నప్పటికీ తవ్వకాలు కొనసాగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.