'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MDK: మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య సూచన చేశారు. మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని సాయిగాంల నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు చేరుతోంది. దీనితో సింగూరు నుంచి మంజీరా నదిలోకి నీటిని విడుదల చేయాల్సి వస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.