VIDEO: ప్రభుత్వ స్థలంలో పాడుబడ్డ వాహనాలు తొలగించరా..?
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డులోని UPHC, రెవెన్యూ ఆఫీస్, పౌరసరఫరాల శాఖ కార్యాలయాల వద్ద ప్రభుత్వ ఖాళీ స్థలం పార్కింగ్ కోసం ఉన్నా, పాడుబడ్డ వాహనాలతో నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా వాటిని తొలగించక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టం ప్రకారం వాటిని స్వాధీనం చేసుకుని వేలం వేయాలి లేదా తొలగించాలన్నారు.