వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజుల సెలవు
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్‌పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని, తిరిగి ఫిబ్రవరి 23న సోమవారం మార్కెట్ యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని వెల్లడించారు. కావున రైతులు, వ్యాపారస్తులు, కార్మికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.