నేడు దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు

కడప నగర శివారులోని ఏసీఏ స్టేడియలో ఈనెల 19న దివ్యాంగుల క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘంకార్యదర్శి మనోహర్ రాజు తెలిపారు. శారీరక వైకల్యం, అంధత్వం గల వారు పాల్గొనవచ్చన్నారు. హాజరయ్యే దివ్యాంగులు ప్రభుత్వం జారీ చేసిన సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలని, వైట్స్, క్రికెట్ కిట్ లతో రావాలని సూచించారు.