విద్యుత్ షాక్‌తో యువకుడు స్పాట్ డెడ్

KNR: కరీంనగర్ కట్టరాంపూర్ రోడ్డు నంబర్-7 లో కూలర్‌లో నీళ్లు నింపుతూ విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ కట్టరాంపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వేసవికాలం కావడంతో కూలర్‌లో పైప్‌తో నీళ్లు నింపే క్రమంలో శనివారం సాయంత్రం విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.