బస్సు ఆపలేదని రహదారిపై మహిళల ధర్నా

బస్సు ఆపలేదని రహదారిపై మహిళల ధర్నా

NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూర్ చౌరస్తాలో శ్రీశైలం జాతీయ రహదారిపై నిన్న సాయంత్రం మహిళలు ధర్నా చేపట్టారు. కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం వెళ్లేందుకు గంటల తరబడి ఎదురుచూసినా ఒక్క బస్సు ఆపకపోవడంతో ఆగ్రహంతో వారు బస్సును అడ్డగించారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటన విషయం తెలుసుకన్నా పోలీసులు అక్కడికి రావడంతో పరిస్థితి సద్దుమణిగింది.