జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్, లారీ ఢీ

WGL: రాయపర్తి మండలం మైలారం శివారు జాతీయ రహదారి (563)పై శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు పోతున్న బస్‌ని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో 30మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్‌లో సుమారు 60మంది ప్రయాణికులు వున్నట్టు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.