వరంగల్ పరిధిలో 72 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

వరంగల్ పరిధిలో 72 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

WGL: ట్రాఫిక్ పోలీసులు సోమవారం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 72 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైనట్లు ఇన్స్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. ఇందులో నలుగురికి రెండు రోజుల చొప్పున కోర్టు జైలు శిక్ష విధించగా మద్యం సేవించి వాహనాలు నడిపి మరో 68 మందికి కోర్టు జరిమానాలు విధించిందన్నారు. మద్యం తాగి వాహనం నడపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.