'సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే జైలుకే'
కోనసీమ: ఎన్నికల వేళ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని యానాం పరిపాలనాధికారి శివరాజ్ మీనా సోమవారం హెచ్చరించారు. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్‌లో అబద్ధాలు రాసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. గ్రూపుల్లో అభ్యంతరకర పోస్టులు పెడితే అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తామని ఆయన స్పష్టం చేశారు.