108 అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి బిడ్డ క్షేమం
నారాయణపేట: మక్తల్ మండలం అడవి సత్యారం గ్రామానికి చెందిన రేణుక, 4వ కాన్పు సమయంలో తీవ్రమైన పురిటి నొప్పులతో బాధపడుతూ 108కు సమాచారం అందించారు. శనివారం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వాడ్వాట్ గేట్ వద్ద ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మాగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.