మచిలీపట్నంలో నౌకల తయారీ కేంద్రానికి అనుమతులు

మచిలీపట్నంలో నౌకల తయారీ కేంద్రానికి అనుమతులు

కృష్ణా: మచిలీపట్నంలో నౌకల తయారీతో పాటు ఓడల మరమ్మతుల కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పోర్టు అభివృద్ధికి కీలకమని MP బాలశౌరి పేర్కొన్నారు. రాష్ట్ర మారిటైమ్ బోర్డుకు అవసరమైన అధికారాలు కల్పించడంతో మచిలీపట్నం పోర్టుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు.