VIDEO: పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకు చేరిన రైతువేదిక
ASF: బెజ్జూర్ మండలం సోమిని రైతు వేదిక పర్యవేక్షణ లోపంతో శిథిలావస్థకు చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాసిరకం పనులతో భవనం పైకప్పు లేచిపోవడంతో సమావేశాలు నిర్వహించే వీలులేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం ఆదరణకు నోచుకోక నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.