మోడల్ స్కూల్లో విద్యార్థులకు కెరీర్ మార్గదర్శకత్వం
KNR: నూకపెల్లి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ మార్గదర్శకత్వంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రొఫెసర్ పడాల తిరుపతి హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేసి, స్వామి వివేకానంద పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గుమ్మడి ఆదిత్య, వినయ్, డాక్టర్ రజిత, తదితరులు పాల్గొన్నారు.