ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
MDK: చేగుంట మండల పరిధి బోనాల కొండాపూర్, ఇబ్రహీంపూర్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, డీఆర్డీఏ, ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకాలు చేయాలని ప్రతాపరెడ్డి సూచించారు.