మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి

NLG: రెండు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తుతుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమై రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1487 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1187 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు.