రేగోడ్ మండలంలో కరెంట్ కట్!

రేగోడ్ మండలంలో కరెంట్ కట్!

MDK: రేగోడ్ మండలం పరిధిలోని గ్రామాల్లో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని మండల ఏఈ యాసీన్ తెలిపారు. రేగోడ్, గజవాడ సబ్‌ స్టేషన్లలో నిర్వహణ పనులు చేపట్టనున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు సరఫరా నిలిచిపోతుందని వెల్లడించారు.