మద్యం మత్తులో దారుణ హత్య
NGKL: బిజినేపల్లి మండలం గౌరారం శివారులో ఆదివారం రాత్రి దారుణ హత్య చోటు చేసుకుంది. కొల్లాపూర్ పట్టణానికి చెందిన జగన్, లట్టుపల్లి గ్రామానికి చెందిన పరుశరాములు గౌరారం గ్రామానికి ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వారి ఇద్దరి మధ్య మాట మాట పెరిగి జగన్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.