ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన MLA

VKB: పరిగి మండలం సుల్తాన్ పూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిగి MLA రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై ఆరా తీశారు. లబ్ధిదారులు త్వరితగతిన తమ గృహాల్లోకి చేరుకునేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎస్టీ సెల్ అధ్యక్షుడు తౌర్యా నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.