'ఉపాధ్యాయలను వెంటనే రిలీవ్ చేయాలి'

NRPT: బదిలీలయిన ఎస్జీటీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని తపస్ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దజట్రం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం అనంతరం ఉపాధ్యాయులు విద్యాశాఖ చర్యలకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.14ఏండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న పాఠశాలల నుంచి రిలీవ్ కాలేదన్నారు.లేనిపక్షంలో ఆందోళలను ఉధృతం చేస్తామన్నారు.