కోయిల్ సాగర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

కోయిల్ సాగర్ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

NRPT: మరికల్ మండలం తిలేరు పంప్ హౌస్ వద్ద శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పూజలు చేసి కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు నీటిని కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు తరలిస్తున్నామని చెప్పారు. ప్రాజక్టు కింద ఉన్న రైతులకు నీరు ఉపయోగపడుతుందని అన్నారు.