26న జాబ్ మేళా

VSP: నిరుద్యోగ యువతకు జాబ్ మేళా ఈ నెల 26న ఉదయం 10గంటలకు స్థానిక నేషనల్ కెరీర్ సెంటర్‌లో జరగనున్నట్లు ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్. శ్యామ్‌సుందర్ తెలిపారు. ముత్తూట్ మైక్రోఫిన్, అపోలో ఫార్మసీ సంస్థలో 200 ఖాళీలకు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఫార్మసీ అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.