నెల్లూరులో 'ఈ-రాడ్'.. ప్రమాదాలకు చెక్!
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం 'ఈ-రాడ్' యాప్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. పోలీస్, రవాణా, వైద్య, ఆర్ అండ్ బి శాఖలు సమన్వయంతో ప్రమాద వివరాలు సేకరించి, కారణాలు విశ్లేషిస్తారు. జిల్లా వ్యాప్తంగా 5 జాతీయ, 14 రాష్ట్ర రహదారులపై 33 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు తెలిపారు.