VIDEO: ఎస్వీ యూనివర్సిటీ ఎదుట ఆందోళన
TPT: ఎస్వీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఇవాళ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. రిజిస్ట్రార్ భూపతి నాయుడు భార్యకు పదవి కట్టబెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో వారిపై దురుసుగా ప్రవర్తించిన రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అనంతరం ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.