VIDEO: రాజగోపురంలో వన దుర్గామాతకు పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల వన దుర్గా భవాని మాతకు స్థానిక రాజగోపురంలో మంగళవారం పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలు పవిత్ర జలంతో అభిషేకం చేసి మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు. దుర్గమ్మ ప్రధాన ఆలయం మంజీరా నదిలో దిగ్బంధం కావడంతో రాజగోపురం వద్దనే పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.