భీమన్న సన్నిధిలో నటి ఐశ్వర్య రాజేష్ పూజలు
SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారిని ఆమె దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.