VIDEO: పిట్లంలో అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు
కామారెడ్డి జిల్లాలోని పిట్లంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం స్వామివారి మూల విరాట్‌కు అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం భక్తుల కోసం మహా అన్నప్రసాద వితరణ చేపట్టగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.