బటర్‌ఫ్లై లైట్లకు మరమ్మత్తు పనులు
ATP: గుత్తిలోని గాంధీ చౌక్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు డివైడర్ల మధ్యలో ఉన్న బటర్‌ఫ్లై లైట్లను బుధవారం మున్సిపాలిటీ అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. పట్టణ సుందరీకరణలో భాగంగా వెలగని ఈ బటర్‌ఫ్లై లైట్లు మరమ్మత్తు పనులు చేపట్టామన్నారు. పలుచోట్ల లైట్లు వెలగడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు.