'మలేరియా నిర్మూలనకు అందరూ కృషి చేయాలి'

NLG: మలేరియా నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. నల్గొండ DMHO కార్యాలయంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దోమ పుట్టకుండా, కుట్టకుండా అందరూ చేయి చేయి కలిపి మలేరియాను అరికట్టేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.