సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

WNP: గ్రామంలో సాగు యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తున్నామని, అలాంటివి ఏమైనా ఉంటే గ్రామసభల్లో తెలియజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.