VIDEO: NH-65పై భారీగా ట్రాఫిక్ జామ్
NLG: HYD-VJA జాతీయ రహదారిపై చిట్యాల, చౌటుప్పల్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక్కడ జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా వాహనాలను సర్వీస్ రోడ్డు గుండా మళ్లిస్తుండటంతో రోడ్డు ఇరుకుగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో వాహనాల సంఖ్య పెరిగి కిలోమీటర్ల మేర జామ్ అయ్యింది. దీంతో స్థానికులు కూడా ఇబ్బంది పడుతున్నారు.